Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనుమతుల్లేకుండానే వాగ్దేవి కాలేజీ అడ్మిషన్ల దందా

Author
Posted By DIKSOOCHI MEDIA
| 01 Nov 2026, 01:10 PM | Array
అనుమతుల్లేకుండానే వాగ్దేవి కాలేజీ అడ్మిషన్ల దందా

భవిష్యత్తు అగమ్య గోచారం
రంగా రెడ్డి /తుర్కయంజాల్ (నేటి దిక్సూచి )
​
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో అనుమతులు లేని వాగ్దేవి జూనియర్ ప్రైవేట్ కళాశాల గుట్టురట్టయింది. ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండానే సుమారు 111 మంది విద్యార్థులను చేర్చుకుని, గత నాలుగు నెలలుగా అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

​ *నకిలీ కోడ్‌తో మోసం.. బోర్డు రికార్డుల్లో నిల్:*

వాగ్దేవి జూనియర్ కాలేజీ యాజమాన్యం ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్నట్లుగా ‘58301’ అనే కోడ్‌ను విస్తృతంగా ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించింది. తీరా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే ఆ విద్యార్థుల అడ్మిషన్ల వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. విద్యార్థులతో తల్లిదండ్రుల నుంచి ఫీజులు దండుకుని విద్యార్థులకు హాల్‌టికెట్లు, పరీక్షలు రాసే అర్హత లేకుండా చేస్తున్న కాలేజీ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు వాగ్దేవి జూనియర్ కాలేజ్ ముందు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ *ఈ అక్రమ వ్యవహారం బయటకు వచ్చిన తీరిది..!*

ఇవి కూడా చదవండి

వాగ్దేవి జూనియర్ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థి కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికావడంతో ఈ అక్రమ కళాశాల బాగోతం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం పాలైన విద్యార్థిని స్వగ్రామంలోని ప్రభుత్వ కళాశాలలో చేర్పించేందుకు ప్రయత్నించగా, అసలు ఆన్‌లైన్‌లో అడ్మిషన్ రికార్డే లేకపోవడం, కళాశాలకు గుర్తింపే లేదన్న వాస్తవం బయటపడింది. విషయం బయటకు పొక్కడంతో కళాశాల యాజమాన్యం తమ బోర్డులు, ప్రచార ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

​ *గతంలోనే ఈ కాలేజీ బ్లాక్‌లిస్ట్.. అయినా కొరవడిన అధికారుల పర్యవేక్షణ*

నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ కళాశాల యాజమాన్యంపై గతంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు రూ.8 లక్షల జరిమానా విధించి, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని, గుర్రంగూడ ప్రాంతంలో మరో అనధికార బ్రాంచ్‌ను తెరిచి దర్జాగా అడ్మిషన్లు సాగించడం విద్యాశాఖ నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

​చర్యలు తప్పవు: డీఐఈఓ హెచ్చరిక

వాగ్దేవి జూనియర్ కాలేజీ ఎలాంటి అనుమతులు లేవని, ఇప్పటికే దాన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) వెంక్యా నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతి లేని కళాశాలల్లో చేరి మోసపోవద్దని తల్లిదండ్రులకు సూచించారు.