అనుమతుల్లేకుండానే వాగ్దేవి కాలేజీ అడ్మిషన్ల దందా

భవిష్యత్తు అగమ్య గోచారం రంగా రెడ్డి /తుర్కయంజాల్ (నేటి దిక్సూచి ) ​ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో అనుమతులు లేని వాగ్దేవి జూనియర్ ప్రైవేట్ కళాశాల గుట్టురట్టయింది. ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండానే సుమారు 111 మంది విద్యార్థులను చేర్చుకుని, గత నాలుగు నెలలుగా అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ​ *నకిలీ కోడ్‌తో మోసం.. బోర్డు రికార్డుల్లో నిల్:* వాగ్దేవి జూనియర్ కాలేజీ యాజమాన్యం ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్నట్లుగా ‘58301’ అనే కోడ్‌ను విస్తృతంగా ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించింది. తీరా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే ఆ విద్యార్థుల అడ్మిషన్ల వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు...