Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మర్రిగూడ కాంగ్రెస్‌లో కమిటీల ప్రక్షాళన

Author
Posted By DIKSOOCHI MEDIA
| 25 Oct 2026, 10:16 AM |
మర్రిగూడ కాంగ్రెస్‌లో కమిటీల ప్రక్షాళన

గ్రామ శాఖల రద్దు.. త్వరలో కొత్త కమిటీల నియామకం

గ్రామ శాఖల రద్దు.. త్వరలో కొత్త కమిటీల నియామకం
మర్రిగూడ, (నేటి దిక్సూచి ):
మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీని(conress) క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల పరిధిలోని గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత కమిటీలను రద్దు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ వెల్లడించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచనలు, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నం కైలాష్ నేత మార్గదర్శకత్వంలో తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం లక్ష్యంగా త్వరలో నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు కొత్త కమిటీల్లో ప్రాధాన్యత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
నూతన కమిటీల ఏర్పాటు నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ, అధిష్ఠానం నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని రామదాసు శ్రీనివాస్ కోరారు.