మర్రిగూడ కాంగ్రెస్లో కమిటీల ప్రక్షాళన
గ్రామ శాఖల రద్దు.. త్వరలో కొత్త కమిటీల నియామకం గ్రామ శాఖల రద్దు.. త్వరలో కొత్త కమిటీల నియామకం మర్రిగూడ, (నేటి దిక్సూచి ): మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీని(conress) క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల పరిధిలోని గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత కమిటీలను రద్దు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ వెల్లడించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సూచనలు, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నం...