అనుమతుల్లేని వెంచర్ల దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?
భూముల్లో అక్రమ లేఔట్లు.. ఆన్లైన్లో ప్లాట్ల విక్రయాలునాలా ఫీజులు చెల్లించకుండానే రియల్ వ్యాపారం.. ప్రభుత్వ ఆదాయానికి గండి.
ఫిర్యాదులు చేసినా చర్యలేవీ? అనుమతులు లేకుండా ప్లాట్లు కొంటే కొనుగోలుదారులకు తప్పని ముప్పు
వ్యవసాయ భూముల్లో అక్రమ లేఔట్లు.. ఆన్లైన్లో ప్లాట్ల విక్రయాలు
నాలా ఫీజులు చెల్లించకుండానే రియల్ వ్యాపారం.. ప్రభుత్వ ఆదాయానికి గండి

నల్గొండ–చింతపల్లి /నేటి దిక్సూచి :
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన అనుమతులు పొందకుండా, నిబంధనలను పాటించకుండా లేఔట్లు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల స్వభావ మార్పిడికి సంబంధించిన నాలా ఫీజులు చెల్లించకుండానే ప్లాట్ల విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు స్పందించడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని పరిశీలించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
భూముల ధరలకు రెక్కలు.. అక్రమ లేఔట్లకు ఊతం!
హైదరాబాద్–నాగార్జునసాగర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న చింతపల్లి మండల కేంద్రం, పరిసర గ్రామాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు లక్షల రూపాయల్లో ఉన్న ఎకరా ధరలు ప్రస్తుతం కోట్ల రూపాయలకు చేరడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పలువురు దృష్టి సారిస్తున్నారు. ఈ పరిణామాన్ని అవకాశంగా తీసుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లుగా విభజించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండల పరిధిలోని తీదేడు గ్రామ శివారులో సుమారు ఎనిమిది ఎకరాల భూమిలో అవసరమైన అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.అయితే సదరు భూమికి సంబంధించిన అనుమతులు, భూమి వినియోగ మార్పిడి వివరాలు, సంబంధిత రుసుముల చెల్లింపులపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఫిర్యాదులు వెళ్లినా ఫలితం ఏది?
తీదేడు గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా సబ్ కలెక్టర్, డీపీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తే ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశముంది. అదే సమయంలో అవసరమైన అనుమతులు, లేఔట్ ఆమోదాలు పరిశీలించకుండా ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందువల్ల సంబంధిత శాఖలు భూముల రికార్డులు, లేఔట్ అనుమతులు, నాలా ఫీజుల చెల్లింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి
తీదేడు గ్రామ శివారులోని వెంచర్‌పై వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుంటే నిబంధనల ప్రకారం విక్రయాలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు వసూలయ్యాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు.
అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.